- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Eatala Rajendar : మూసీలో పారాల్సింది తాగే నీరు.. ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ (MUSI) ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, కానీ మూసీలో పారాల్సింది మురికి నీరు కాదు, తాగే నీరు పారాలని మేము కోరుకుంటున్నామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్ కంటోన్‌మెంట్, భావన కాలనీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనకు ఎప్పుడూ మేము వ్యతిరేకించలేదు, కానీ ఇల్లు కూలగొట్టి పెద్దలకు, కార్పొరేట్ కంపెనీలకు ఆ భూములు కట్టబెట్టే ఆలోచనను మేము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి హోదాని మరిచిపోయి ప్రజల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి విషయాల్లో మాలాంటి వారు మీకు అండగా ఉంటామని వెల్లడించారు. అధికారం అమ్మ ఇచ్చింది కాదు, కొనుక్కుంటే దొరికేది కాదు ప్రజల ఆశీర్వాదంతో వాళ్ల ఓట్లకు పుట్టిన పదవి, వాళ్ళు ఇచ్చిన అధికారాన్ని పట్టుకొని వాళ్ల మీద దౌర్జన్యం చేస్తానంటే.. చూసి చూసి బండకేసి కొడతారు.. అని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ను కొడితే ఏమైపోయారో మీరు చూశారు.. వీళ్ళని కొట్టే రోజులు ఎక్కువ దూరం లేదన్నారు. నాలుగు సంవత్సరాలు ఉంది ప్రజల కోసం మంచి చేసే ప్రయత్నం చేయి.. అంటూ ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశ సమగ్రత, అభివృద్ధి, ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద నిలవాలంటే ప్రధాని మోడీకి మరింత బలం చేకూర్చాలన్న సంకల్పం దేశవ్యాప్తంగా చూస్తున్నామని తెలిపారు. గతంలో కంటోన్‌మెంట్‌లో ఎప్పుడూ కూడా బీజేపీ గెలవలేదన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లో తిలక్‌కి తక్కువ ఓట్లు వచ్చిన అంతిమంగా ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ గెలిచింది భారతీయ జనతా పార్టీ, ఎగిరింది కాషాయ జెండా కాబట్టి మీరంతట మీరే గొప్పగా పని చేసి గెలిపించినందుకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్‌లో మనకి పడ్డ ఓట్లలో 50% మెంబర్షిప్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దానికోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఎంపీగా మీకు కొత్త కావచ్చు కానీ 25 ఏళ్ల రాజకీయ చరిత్ర మీ కళ్ళముందే ఉంటుందని, నా మీద నమ్మకం విశ్వాసం మీరు వ్యక్తపరిచారని, దానికి తగ్గట్టుగా పని విధానం ఉంటుందని హామీ చేశారు. ఏ కష్టం వచ్చినా మీ వెంట మేముంటామని భరోసా ఇచ్చారు.