- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వివాదాస్పదంగా మారిన నిర్ణయం.. వీసీ తీరుపై అనుమానాలు!
దిశ, తెలంగాణ బ్యూరో: కాకతీయ యూనివర్సిటీలో పార్ట్ టైం పందేరం మొదలైంది. వైస్ చాన్స్‌లర్ టి.రమేశ్ తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదంగా మారింది. వచ్చే ఏడాది ఏప్రిల్, డిసెంబర్‌లో రెండు విడుతల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీసీ ఏకపక్షంగా పార్ట్ టైం పద్ధతిలో లెక్చరర్ పోస్టుల భర్తీకి సర్క్యులర్ జారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నరేళ్లలో ఒక్క పార్ట్ టైం లెక్చరర్ పోస్టును భర్తీ చేయని వీసీ కేవలం తన స్కాలర్లు, తన వర్గపు ప్రొఫెసర్ల స్కాలర్లను రిక్రూట్ చేసుకునేందుకే పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సర్కార్ ఉత్తర్వులు కాదని, పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని, క్వాలిఫై కానోళ్లకు సైతం డిపార్ట్‌మెంట్లలో సీట్లు ఇచ్చారని, మరికొందరికి రిటెన్ టెస్టులో మంచి మార్కులు వచ్చినా.. ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులు వేసి సీట్లు రాకుండా చేశారని వీసీ రమేశ్‌పై ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యార్థుల ఆందోళనకు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందే అప్పటి మంత్రి కేటీఆర్ పీహెచ్‌డీ అడ్మిషన్లలో అక్రమాలపై విచారణకు ఆదేశించారు. కానీ ఎలాంటి విచారణ జరగలేదు. యూనివర్సిటీల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా కాంట్రాక్ట్, పార్ట్ టైంతోపాటు మరే పద్ధతిలోనూ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవద్దని ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఉన్నత విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్‌కు విరుద్ధంగా కొత్త సర్కార్ అనుమతి లేకుండానే రిక్రూట్‌మెంట్‌కు సిద్ధం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.