- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sridhar Babu: ఆర్థిక క్రమశిక్షణతో ఒక్కో హామీ అమలు: మంత్రి శ్రీధర్ బాబు
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక్కో హామీని అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చిన మాటను నేడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. వేములవాడ సభ (Vemulawada meeting) లో ప్రసంగించిన ఆయన.. పెండింగ్ ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు యారన్ డిపో (నూలు డిపో)ను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ప్రతి ఎకరా సాగు అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి సీఎం సహా మేమంతా వచ్చామని రాబోయే 4 ఏళ్లు దిగ్విజయంగా ప్రజా సంక్షేమానికి పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోబోతున్నామన్నారు. నిరంతరం ప్రజలలో తిరిగే శ్రమ జీవి ప్రభుత్వ విప్ వేములవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు.