మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..! ఆయనకు ఛాన్స్..!

by Javid Pasha |
మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..! ఆయనకు ఛాన్స్..!
X

దిశ, తుక్కుగూడ: మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్​ అభ్యర్థిగా అనుహ్యంగా మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పేరు తెరపైకి రావడంతో.... ఇదే సీటుపై గంపెడాశలు పెట్టుకొన్న ఆశావాహులంతా నిరాశ నిస్పృలోకి జారుకొన్నారు. అధికార పార్టీ అభ్యర్థులను నిలువరించే క్రమంలో ఆయా నియోజకవర్గాలకు బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో ఆధిష్టానం ప్రత్యేక వ్యూహాలు రచిస్తుంది. దీనిలో భాగంగానే రెండవ విడత అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా సమాలోచనలు చేస్తూ గెలుపు గుర్రాలకే జై కోడుతుంది. ఈ క్రమంలో మహేశ్వరం నియోజకవర్గంపై పార్టీ దృష్టి సారించింది. మహేశ్వరం బరిలో అధికార పార్టీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఢికొట్టే సత్తా గల అభ్యర్థిని మాత్రమే బరిలో దింపేందుకు ఆదిష్టానం ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వేనే ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్​ అభ్యర్థులను పార్టీ డిక్లెర్ ​చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే మహేశ్వరం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది.

మహేశ్వరం సీటును ఆశించి బీఆర్​ఎస్​ నుంచి పార్టీ మారి కాంగ్రెస్​లోకి వచ్చిన బడంగ్​పేట్ ​మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ్మారెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి, దేపా భాస్కర్​రెడ్డి, వై అమరేందర్​రెడ్డిలు పేర్లు తెరపైకి రావడంతో వారంతా ఆయోమయంలో పడ్డారు. కేఏల్​ఆర్​కు మహేశ్వరం టికెట్​ కేటాయిస్తున్నారనే వార్తపై జోరుగా చర్చ సాగుతుంది. ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గం నుంచి నలుగులు ఆశావాహులు తమకే సీటు దక్కుతుందనే పూర్తి ధీమాతో ఉన్నారు. పార్టీ పెద్దల ఆశీర్వాదంతో ఖర్చుకు వెనుకాడకుండా ప్రచారంలో దిగారు. అయితే పార్టీ అభ్యర్థుల కేటాయింపులో ఆదిష్టానం అనుసరిస్తున్న విధానంపై చిగిరింత పాటు పలువురు ఆశావహులకు పార్టీ నిర్ణయం మింగుడుపడటం లేదు. స్థానికేతరుడు కేఏల్​ఆర్ ​బరిలో నిలిస్తే ఇప్పుడు ఉన్న ఆశావాహులంతా భవితవ్యం ఏంటి ....ఆయనకు మద్దతూ గా నిలబడుతారా... లేదా పార్టీ మారుతారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

అయితే మంత్రిని తట్టుకొని మహేశ్వరంలో కేఏల్​ఆర్​ పాగా వేయగలడా అనేదే ఇప్పుడు వెయ్యి డాలర్ల ​ప్రశ్నగా మారింది. ఇదే నియోజకవర్గం నుంచి గతంలో స్థానికేతరాలుగా అడుగుపెట్టిన సబితా ఇంద్రారెడ్డిని విజయం వరించింది. ఈ ప్రాంత ప్రజలు ఆమెను ఆదరించి అక్కున చేర్చుకొంది. అయితే పార్టీ ఆదిష్టానం అభ్యర్థి విషయంపై పూర్తి క్లారిటీ వెల్లడించిన అనంతరమే ఆశావహులు తీసుకోనున్నారు. మొత్తానికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో సస్పెన్షన్ మాత్రం​ కొనసాగుతునే ఉండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed