- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నో పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలి.. పాత పెన్షన్ పథకాన్ని కొనసాగించాలి'
దిశ, తెలంగాణ బ్యూరో: నో పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి.. పాత పెన్షన్ (ఓపీఎస్) పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీసీజీజీఓఓ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సీసీజీజీఓఓ జాతీయ ఉపాధ్యక్షుడు వి.కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు పాత పెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ హయాం నుంచి ఓపీఎస్ కొనసాగుతోందన్నారు.
కేరళ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఓపీఎస్ పునరుద్ధరణ కోసం కమిటీలను నియమించాయరి వివరించారు. కానీ పీఎఫ్ ఆర్డీఏ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆఫీసర్లు 2004 నుంచి పీఎఫ్ ఆర్డీఏ అందించిన విరాళాలను తిరిగి పాత పెన్షన్ స్కీమ్‌కి మారాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు.
పాత పెన్షన్ స్కీంపై అనేక కోర్టులు అనుకూల తీర్పులు ఇచ్చినప్పటికీ, సుప్రీంకోర్టు తీర్పును సైతం కేంద్ర ప్రభుత్వం సీఏపీఎఫ్ లకు కూడా ఓపీఎస్ ని కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదని తెలిపారు. ప్రభుత్వం ప్రజాసంపదను కార్పోరేట్లకు దోచి పెడుతున్నదనీ, సామాజిక రంగానికి, వృద్ధాప్య భద్రతపై కోతలు విధిస్తున్నదని ఆరోపించారు. రైల్వే, రక్షణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పారా సాయుధ బలగాల పెన్షనర్ల సంఘాలు మొదలైన వారు వృద్ధాప్య భద్రతను కాపాడేందుకు నో గ్యారెంటీ పెన్షన్ స్కీం ఎన్‌పీఎస్‌ను రద్దు చేయాలని పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు వెంటనే తీవ్రతరం చేయనున్నట్లు హెచ్చరించారు.
- Tags
- old pension