తెలంగాణలో భారీ వరదలు.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |   ( Updated:2024-09-02 15:15:35.0  )
తెలంగాణలో భారీ వరదలు.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో వరదల ప్రభావం అధికంగా ఉంది. కాగా ఈ వదల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో పలువురు మృతి చెందారు. కాగా ఈ వరదలపై సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ లో అధికారులతో మాట్లాడిన తర్వాత సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. మొదట రూ. 4 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాగా దానిని రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే వరదల కారణంగా ఎఫెక్ట్ అయిన జిల్లాలకు తక్షణ సహాయం కింద ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి, సూర్యాపేట జిల్లాల కలెక్టరేట్లకు రూ. 5 కోట్లు విడుదల చేశారు. అలాగే వరద ప్రాంతాల్లో అధికారులు పర్యటించి వెంటనే పంట, ఆస్థి నష్టం పై సమాచారం అందించాలని.. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అలాగే అన్ని కలెక్టరేట్లలో కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని.. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు స్పందించాలన్నారు. వరద నష్టం పై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని.. అత్యవసర సేవల కోసం పోలీస్‌ బెటాలియన్లకు..ఎన్‌డీఆర్‌ఎఫ్‌ తరహాలో శిక్షణ ఇవ్వాలి అధికారులకు సీఎం సూచించారు.

Advertisement

Next Story

Most Viewed