ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-24 01:56:07.0  )
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ లను పెంచిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మోడీ ప్రభుత్వం జూలైలో మరోసారి డియర్ నెస్ అలవెన్స్‌ను పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగనుంది. సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ కి కూడా లబ్ధి చేకూరనుంది. అయితే 7వ వేతన సంఘం ప్రకారం డీఏ, డీఆర్ లను ఏడాదికి రెండుసార్లు పెంచాల్సి ఉంటుంది. మెుదటిసారిగా డియర్ నెస్ అలవెన్స్, డీఆర్ జనవరిలో పెంచింది. రెండవ రివిజన్ జూలైలో జరగనుంది. ఏఐసీపీఐ ఇండిక్స్ ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. దీని లెక్కలు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కింద లేబర్ బ్యూరో జారీ చేస్తుంది. ఉద్యోగులను, పింఛన్ దార్లను ద్రవ్యోల్బణం నుంచి కాపాడేందుకు ఏడాదికి రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ, డీఆర్ లను పెంచుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed