Bhatti : ఉచిత నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై భట్టి కీలక వ్యాఖ్యలు

by Ramesh N |   ( Updated:2024-10-06 08:04:29.0  )
Bhatti : ఉచిత నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తయారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్, కాంప్లెక్స్‌ల అంశంపై ప్రత్యేక భేటీ నిర్వహంచారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్ట్స్‌తో ఇంగ్లీష్ మీడియం 12 వ తరగతి వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని, ఇబ్బంది కరమైన వాతావరణంలో విద్య నేర్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు నాడు చెప్పినట్లుగా ఇందిరమ్మ రాజ్యంలో పేద బడుగు బలహీన కుటుంబాలకు ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రాథమిక స్థాయి నుంచి అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ దేశ చరిత్రలోనే అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఈ విధంగా ఉంటాయా? ఇలా కూడా కట్టొచ్చా? అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పొతున్నామన్నారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తుచేశారు. ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచాలని ఆలోచన ఉందన్నారు.

ప్రస్తుతం 20 నుంచి 22 వరకు స్థలాలు సేకరించి ఆయా నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామన్నారు. దసరా పండుగ కంటే ముందే భూమి పూజ చేసి నిర్మాణాలు చేపడతామన్నారు. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని, 663 స్కూళ్లకు సొంత భవనాలు లేవన్నారు. బీసీలకు 367 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 అద్దె భవనాలు అని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఈ ఏడాది రూ.5 వేల కోట్లు నిధులు ఖర్చు చేస్తామని చెప్పారు. విజయదశమి ముందు రోజు ఈ నెల 11 వ తేదీన ఆ స్కూళ్లకు ఫౌండేషన్ వేస్తామని చెప్పారు. కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed