- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ మార్పుల వార్తలపై స్పందించిన రాజయ్య.. బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు వార్తలపై మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. శనివారం ఆయన ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. ‘‘ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నాను. నాకు చేసిన అవమానం మానసిక వేదనను, భరించలేని బాధను కలిగించింది. ప్రస్తుత పార్టీ విధివిధానాలు నచ్చడం లేదు. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అతి త్వరలో కేసీఆర్‌కు నా రాజానామా లేఖ పంపిస్తా. నాకు టికెట్ ఇవ్వకపోవడం కారణంగా మాదిగ సామాజికవర్గ అస్తిత్వం మీద దెబ్బపడింది. నా సామాజిక వర్గానికి క్షమాపణలు చెబుతున్నా. ఆరు నెలలుగా ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నాను.
అధిష్టానం మాట్లాడుతుందని.. స్పందిస్తుందని ఎదురుచూశా. కానీ, ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు కూల్చుతామని మాట్లాడటం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్‌కు క్షేత్రస్థాయిలో ఆదరణ కరువైంది. ఇక మున్ముందు బీఆర్ఎస్‌కు మరింత గడ్డుకాలం తప్పదు. ఏ పార్టీలో చేరబోయేది త్వరలో ప్రకటిస్తా. నా అనుచరులు, సామాజిక వర్గ నేతలతో మరోసారి మట్లాడాలి’’ అని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైనట్లు సమాచారం.