- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
world adivasi day:ఆదివాసీలపై ఆ తప్పుడు ప్రచారం సరికాదు: సీతక్క
దిశ, డైనమిక్ బ్యూరో: గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని ఆదివాసి భవన్ లో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు మంత్రి సీతక్క, పలువురు గిరిజనే నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు ఆకట్టుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత యూపీయే హయంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అటవీ హక్కుల చట్టం ద్వారా ఆదివాసీలకు భూమి మీద హక్కు కల్పించారని. ఆ చట్టం వచ్చాక గిరిజనులుకు భూమిపై హక్కు వచ్చిందన్నారు. కానీ 2023 లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవో చట్టం ప్రకారం గ్రామాల్లో మైనింగ్ చేసేందుకు గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా నేరుగా ఢిల్లీలో అనుమతులు ఉంచే చాలు అనే నిబంధన తీసుకువచ్చారని విమర్శించారు. ఈ చట్టం ప్రకారం అటవీ ప్రాంతాల్లో మైనింగ్ కి పర్మిషన్ ఇస్తున్నారు కానీ అదే అటవీ ప్రాంతంలో రోడ్లు వేసేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు.
అడవుల్ని గిరిజన ప్రజలే నాశనం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. నిజానికి అడవులు సురక్షింతంగా ఉన్నాయంటే అందులో ఆదివాసి బిడ్డలదే కీలక పాత్ర అన్నారు. గడిచిన 10 ఏండ్లలో ట్రైబల్ ఏరియాలో ఉద్యోగాలు రాలేవన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ డెవలప్ మెంట్ ఫండ్ అని తీసుకువచ్చి రూ.73 వేల కోట్లు కేటాయించి ఈ పదేళ్లలో రూ.28 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ప్రకటనలు బారెడు అంత ఉండే ఖర్చు చారెడు అంతే ఉన్నాయన్నారు. స్థిరమైన వ్యవసాయం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నీటి వనరులు కల్పిచాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. మన హక్కుల్ని పోరాడి సాధించుకోవాలని అన్నారు. జీవో నంబర్ 3 తీసేయడంతో ఉద్యోగాలు లేవన్నారు. చెంచు జాతి అంతరించిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.