హామీని నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ : గూడెం మహిపాల్ రెడ్డి

by Sathputhe Rajesh |
హామీని నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ : గూడెం మహిపాల్ రెడ్డి
X

- దిశ బ్యూరో, సంగారెడ్డి/పటాన్ చెరు : పటాన్ చెరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు కల నెరవేరడం చాలా సంతోషంగా ఉన్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం కూడా పటాన్ చెరులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. ఏప్రిల్ 1 నుంచి సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో పటాన్చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనులు ప్రారంభం కానున్నాయని, రానున్న నెల రోజుల్లో పటాన్ చెరులో నూతన భవనం ప్రారంభం కానున్నదని ఎమ్మెల్యే వెల్లడించారు.

పటాన్ చెరుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం కూడా పటాన్ చెరులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. ఏప్రిల్ 1 నుంచి సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో పటాన్చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనులు ప్రారంభం కానున్నాయని, రానున్న నెల రోజుల్లో పటాన్చెరులో నూతన భవనం ప్రారంభం కానున్నదని ఎమ్మెల్యే జీఎంఆర్ వెల్లడించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం అన్నారు. రాష్ట్ర రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న పటాన్ చెరు నియోజకవర్గంలో రోజురోజుకి రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్థానికంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందన్నారు.

రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉత్పన్నమయ్యేవని తెలిపారు. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల్లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నూతన భవనం అందుబాటులో వచ్చేవరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనే పటాన్చెరు సబ్ రిజిస్టార్ కార్యాలయం సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. పటాన్ చెరు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో నూతన కార్యాలయం భవనాన్ని నెల రోజుల్లో సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రధాన హామీల్లో రెండు హామీలను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు రూ.70 కోట్లతో బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు 100 ఫీట్ల రహదారిని విస్తరించినట్లు వెల్లడించారు.

మున్సిఫ్ కోర్టులు వస్తాయి.

పటాన్ చెరు, జిన్నారం మండలాల్లో మున్సిఫ్ కోర్టుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. హెచ్ఎండీఏ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ రవీందర్రావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు ఆడిట్ రిజిస్ట్రార్,అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ సేవలు సైతం పటాన్ చెరులో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు పుష్ప నగేష్, సింధూ ఆదర్శ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, వెంకట్ రెడ్డి, బాల్ రెడ్డి, రాజు, షేక్ హుస్సేన్, గోపాల్, బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి, పృథ్విరాజ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story