TG High Court: కూల్చివేతలపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్... హైడ్రాకు ధర్మాసనం కీలక ఆదేశాలు

by Shiva |
TG High Court: కూల్చివేతలపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్... హైడ్రాకు ధర్మాసనం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా నెలకొల్పబడిన ‘హైడ్రా’ (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ల (Buffer Zone)లోని ఆక్రమణలు తొలగిస్తూ.. శరవేగంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఎలాంటి నోటీసులు, ముందస్తు సమాచారం లేకుండానే ‘హైడ్రా’ (HYDRA) నగర వ్యాప్తంగా ఇళ్లను కూల్చివేస్తుందని.. తక్షణమే కూల్చివేతలను ఆపాలని ఇటీవలే ప్రజా‌శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ (KA Paul) తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం ‘హైడ్రా’ (HYDRA)కు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. వారు ప్రత్యామ్నాయం చూసుకునే వరకు ఇంటి యజయానులకు కొంత సమయం ఇవ్వాలని పేర్కొ్ంది. కాగా, ఈ కేసులో కేఏ పాల్ (KA Paul) హైకోర్టు (High Court)కు స్వయంగా తన వాదనలు వినిపించారు. అదేవిధంగా మూసీ పునరుజ్జీవంలో భాగంగా బాధితులకు ఇళ్లు కట్టించిన తరువాతే వాళ్ల ఇళ్ల కూల్చివేతలను ప్రారంభించాలని హైకోర్టు (High Court) తెలిపింది. అయితే, అందుకు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (Additional Advocate General) సమాధానమిస్తూ.. మూసీ పరివాహక ప్రాంత బాధితులకు ప్రత్యామ్నయం చూపాకే అక్కడ కూల్చివేతలు చేపడుతున్నామని కోర్టుకు వివరించారు. త్వరలోనే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రాకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed