TG Assembly : మేం విడిగా కూర్చుంటాం.. కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్

by Rajesh |
TG Assembly : మేం విడిగా కూర్చుంటాం.. కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్‌లో చేరినప్పటికీ విడిగా కూర్చుంటామని, దానికి తగినట్లుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేయాలని స్పీకర్‌కు రిక్వెస్టు పెట్టారు. కాంగ్రెస్‌లో చేరినప్పటికీ అధికార పక్షం కూర్చునేవైపు ఉండబోమని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకూ సమ దూరంగా తాము విడిగానే ఉంటామని, తమ రిక్వెస్టును పరిశీలించాలని శాసనసభాపతికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. గతంలో దుద్దిళ్ల శ్రీపాదరావు స్పీకర్‌గా ఉన్న సమయంలోనూ ఇదే తరహా పరిణామం చోటుచేసుకున్నది. తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో రెండు పార్టీలతో సంబంధం లేకుండా విడిగా కూర్చున్నారు. ఇప్పు డు అదే తరహా సంప్రదాయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొనసాగించే అవకాశమున్నది.

అసెంబ్లీ సెక్రటరీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు లాంఛనంగా మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రారంభం రోజున సికింద్రా బాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం తెలియజేసిన అనంతరం మరుసటి రోజుకు వాయిదా పడనున్నది. ఈ సమావేశం ప్రారంభయ్యే సమయానికే పది మంది ఎమ్మెల్యేలు ఏ వైపు కూర్చుంటారనే ఆసక్తి నెలకొన్నది. వారి కోరిక మేరకు స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Advertisement

Next Story

Most Viewed