- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly: బీఆర్ఎస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నా.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సెటైర్లు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభా సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీచ్ ఆరంభంలోని బీఆర్ఎస్ నేతలపై సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండాలు గ్రామ పంచాయతీలు రూపాంతరం చెందినా.. అక్కడ మౌలిక వసతుల కల్పన జరగలేదన్నారు. ఓ తండాకు రోడ్డు ఉంటే కరెంట్ సౌకర్యం లేదని, కరెంట్ ఉంటే తాగునీరు లేదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని తాండాలు, గూడెలపై పూర్తి నివేదికను తయారు చేశామని అన్నారు. సుమారు 7 లక్షల తాండాలు, గూడెల్లో నేటికీ తాగునీరు, కరెంట్, మంచినీటి సదుపాయాలు లేవనే విషయాన్ని సీఎం సభ దృష్టికి తీసుకొచ్చారు. కానీ, బీఆర్ఎస్ నాయకులు అన్ని తండాల్లో వసుతులు కల్పించామని అబద్ధాలు చెబుతూ వచ్చారని ఫైర్ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఓడించినా.. వారి తీరు ఏమాత్రం మారలేదని అన్నారు. ఇకనైన బీఆర్ఎస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నా అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు.