- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : మహిళా కమిషన్ కార్యలయం వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్‌కు నిరసన సెగ
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్(బుద్ధ భవన్) ఆఫీస్ వద్ద శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఇవాళ కమిషన్ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను మహిళ కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేటీఆర్ మహిళలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత కమిషన్ కార్యాలయం వద్ద బైఠాయిచింది. మరోవైపు కేటీఆర్‌తో పాటు వచ్చిన బీఆర్ఎస్ మహిళ లీడర్లు, కార్పోరేటర్లు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే అక్కడ తోపులాటతో హైటెన్షన్ వాతావరణం మొదలైంది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. కాగా, కేటీఆర్‌ను మాత్రమే మహిళ కమిషన్ ఆఫీస్‌లోకి పోలీసులు అనుమతి ఇచ్చారు.