- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP నాయకుడు చక్రధర్ గౌడ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత (వీడియో)
దిశ, సిద్దపేట ప్రతినిధి: ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ఛైర్మన్, బీజేపీ నాయకుడు చక్రధర్ గౌడ్ కార్యాలయం వద్ద కొందరు వ్యక్తులు హల్ చల్ చేశారు. గురువారం అర్ధరాత్రి సమయంలో రెండు వాహనాలపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు వాచ్ మెన్‌తో దురుసుగా ప్రవర్తించారు. అనంతరం కార్యాలయంలో లోపలికి వెళ్లడానికి గేట్ ఎక్కే ప్రయత్నం చేశారు. కార్యాలయం గేట్ తీసి బయటకు రావాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు వాచ్ మెన్ తెలిపాడు. కార్యాలయంకు నిప్పంటిస్తామని బెదిరించినట్లు వాచ్ మెన్ వాపోయాడు.
ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇటీవల బీజేపీ నేత చక్రధర్ గౌడ్.. తన స్నేహితుడు ప్రదీప్‌తో కలిసి ఓ వీడియో విడుదల చేశాడు. అధికార పార్టీ నాయకులు తనపై దుష్పచారం చేయాలని ప్రదీప్‌ను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ వీడియో సారాంశం. ఇదిలా ఉండగానే తాజాగా చక్రధర్ గౌడ్‌పై మరో వీడియో విడుదలైంది. చక్రధర్ గౌడ్, ఆయన ప్రత్యర్థుల మధ్య సోషల్ మీడియాలో వార్ కొనసాగుతున్న వేళ గురువారం అర్ధరాత్రి చక్రధర్ గౌడ్ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడికి యత్నించడం కలకలం సృష్టించింది.