పది మందికి ఐఏఎస్ హోదా.. గుర్తింపు ఇచ్చిన డీవోపీటీ

by Vinod kumar |
పది మందికి ఐఏఎస్ హోదా.. గుర్తింపు ఇచ్చిన డీవోపీటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఐదుగురు నాన్-స్టేట్ సివిల్ సర్వీసెస్ అధికారులకు, మరో ఐదుగురు స్టేట్ సివిల్ సర్వీసెస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ గుర్తింపు ఇచ్చింది. కే. అశోక్‌రెడ్డి, ఈవీ నర్సింహారెడ్డి, పీ.కాత్యాయనీదేవి, కే.హరిత, డాక్టర్ ఈ నవీన్ నికొలస్‌లకు 2021 సంవత్సరానికిగాను ఈ హోదా కల్పిస్తున్నట్లు డీవోపీటీ (డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్) బుధవారం విడుదల చేసిన గెజిట్‌లో స్పష్టం చేసింది.

స్టేట్ సివిల్ కోటా కింద 2019 సంవత్సరానికిగాను నిర్మలా కాంతి వెస్లీ, 2020 సంవత్సరానికి కోట శ్రీవత్స, 2021 సంవత్సరానికి బడుగు చంద్రశేఖర్, సీహెచ్.ప్రియాంక, జల్దా అరుణశ్రీ లకు ఐఏఎస్ హోదా లభించింది. రాష్ట్రం నుంచి ప్రతీ సంవత్సరం రెవెన్యూ, నాన్-రెవెన్యూ విభాగాల నుంచి ఐఏఎస్ హోదా కోసం అర్హులైన వారిని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి జాబితా పంపడం ఆనవాయితీ. ఆ ప్రకారం 2021 సంవత్సరానికి నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ కోటా కింద వీరికి ఆ హోదా కల్పించినట్లు పేర్కొన్నది.

మొత్తం 25 మంది అధికారుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ జాబితాలో అర్హత ఉన్న అధికారులకు గత నెలలో యూపీఎస్సీ రెండు విడతలుగా ఇంటర్‌వ్యూ నిర్వహించింది. అందులో అర్హత సాధించిన వారి జాబితాను డీవోపీటీ కి పంపింది. చివరకు అధికారపూర్వకంగా డీవోపీటీ నుంచి ఐదుగురిని ఫైనల్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక నుంచి ఈ ఐదుగురూ ఐఏఎస్ అధికారులుగా గుర్తింపు పొందనున్నారు.

Advertisement

Next Story

Most Viewed