వెల వెలబోతున్న చికెన్ షాపులు.. ఆదివారం పూట వ్యాపారుల కన్నీరు

by Gantepaka Srikanth |
వెల వెలబోతున్న చికెన్ షాపులు.. ఆదివారం పూట వ్యాపారుల కన్నీరు
X

దిశ, వెబ్‌డెస్క్: ముక్క లేనిదే ముద్ద దిగని తెలంగాణ(Telangana) గడ్డలో ఆదివారం పూట చికెన్ షాపు(Chicken Shops)లు వెల వెలబోతున్నాయి. బర్డ్ ఫ్లూ(Bird Flu) భయంతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. గత వారం రోజులుగా పరిస్థితి ఇలాగే ఉందని వ్యాపారులు కన్నీరు పెడుతున్నారు. చికెన్‌(Chicken)కు బదులు, మటన్, ఫిష్ మార్కెట్లవైపు పరుగులు తీస్తున్నారు.

కాగా, రాష్ట్రంలో పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండడంతో తెలంగాణ సర్కారు(Telangana Govt) అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు(Food Safety Officials) దాడులు నిర్వహిస్తున్నారు. నాణ్యతగా లేని చికెన్ విక్రయిస్తున్న వ్యాపారులపై ఫుడ్ సేఫ్టే విభాగం కొరడాను ఝులిపిస్తోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా వ్యాపారుల ధోరణి మారకపోవడంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మరోవైపు పలు షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా బయటపడినట్లు తెలిసింది. సుమారుగా 500 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్‌ను చూసి అధికారులు షాక్ అయ్యారు. వ్యాపారులపై కేసు నమోదు చేసిన అధికారులు.. కుళ్లిన చికెన్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు.. ప్రజల్లో బర్డ్ ఫ్లూ(Bird Flu) భయం పెరుగుతున్నా చికెన్ ధరల్లో(Chicken Rates) మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. గతవారం కేజీ చికెన్ 220 నుంచి 240 ఉండగా.. ప్రస్తుతం 200 నుంచి 220 వరకు అమ్ముతున్నారు. హైదరాబాద్, విజయవాడలో రూ.220, చిత్తూరులో రూ.160 వరకు కొనసాగుతోంది. వైరస్ సోకిన కోళ్లను తినొద్దని, సోకని కోడి మాంసాన్ని 70 నుంచి 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలని నిపుణులు సూచించారు.

Next Story