- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : తెలంగాణను ఆగం చేశారు : కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్ : అడ్డగోలు హామీలిచ్చి, అరచేతిలో వైకుంఠం చూపెట్టి మంచిగున్న తెలంగాణ(Telangana)ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆగం చేసిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR) విమర్శించారు. శనివారం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొడంగల్ మండల కాంగ్రెస్ మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డి, బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ నర్మద సహా పలువురు బీఆర్ఎస్ లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోరాటం ఒక ఎత్తైతే.. కోడంగల్ లో మరొక ఎత్తు అన్నారు. రేవంత్ లాంటి దుర్మార్గుడితో తలపడుతూ ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటున్న పట్నం నరేందర్ రెడ్డి సహా మిగతా వారిని నేను అభినందిస్తున్నానన్నారు. పోలీసులతో రేవంత్ రెడ్డి అనేక బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నా ధైర్యంగా పోరాడుతున్న కొడంగల్ వాసుల పోరాటం స్ఫూర్తి దాయకమన్నారు.