Liquor sales : మద్యం విక్రయాల్లో తెలంగాణ టాప్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-01 07:27:47.0  )
Liquor sales : మద్యం విక్రయాల్లో తెలంగాణ టాప్
X

దిశ, వెబ్ డెస్క్ : మద్యం విక్రయా(Liquor sales)లలో దేశంలోనే తెలంగాణ(Telangana) దక్షిణాది రాష్ట్రల్లోనే మొదటి స్థానం(In the first place)లో నిలిచింది. ఈ జాబితాలో పొరుగు తెలుగు రాష్ట్రం ఏపీ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ(NIPFP) సంస్థ సర్వేలో మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడైంది. తెలంగాణలో గతేడాది సగటున ఒక్కో వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేయగా, ఏపీలో రూ.1,306 ఖర్చు చేశారు. పంజాబ్ లో రూ.1,245, ఛత్తీస్ గడ్ లో రూ.1,227 ఒక్కో వ్యక్తి ఖర్చుచేస్తున్నట్లు పేర్కొంది. ఇక మరోవైపు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మద్యంపై తక్కువ ఖర్చు చేస్తున్నాయని పేర్కొంది. మద్యంపై అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో వెస్ట్ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. 2022-23లో పశ్చిమబెంగాల్‌లో సగటున ఓ వ్యక్తి మద్యంపై కేవలం రూ.4 మాత్రమే ఖర్చు చేసినట్లు నివేదిక తెలిపింది. దేశంలో జనాభా ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ ఒక్కో వ్యక్తి సగటున మద్యంపై ఏడాదికి రూ.49 మాత్రమే ఖర్చు చేస్తున్నారు.

తెలంగాణలో ఏ పండుగైనా, పార్టీ..ఫంక్షన్‌ అయినా మందు, ముక్కా లేనిదే సాగదు. ఎన్నికల్లోనైతే చెప్పనవసరం లేదు. దీంతో మద్యంపై ఎక్కువ ఖర్చుచేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు ఉండగా, మరో వెయ్యి వరకు బార్లు, పబ్స్ ఉన్నాయి. ఇటీవల దసరా సందర్భంగా దాదాపు రూ.1,000 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 11 లక్షల కేసుల మద్యం, 18 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా బీరు కొనుగోలు చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య బీర్లు తాగిన వారి సంఖ్య 302.84 లక్షలు అని, ఏపీలో 16.9 లక్షల బీర్లు అమ్ముడయ్యాయని సర్వేలో వెల్లడైంది.

Advertisement

Next Story

Most Viewed