- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ నియోజకవర్గాలకు అబ్జర్వర్ల నియామకం
దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం విజయవంతానికి పార్టీ అధిష్టానం అన్ని చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించింది. శనివారం అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ విడుదల చేశారు. పార్లమెంట్ అబ్జర్వర్లు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లను సమన్వయం చేసుకొని ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం లక్ష్యాలను విజయవంతం చేయాలని కాసాని సూచించారు. వార్డు, గ్రామ, మండల, మున్సిపల్, కార్పొరేషన్లలోని డివిజన్‌లో పార్టీ కమిటీలను నియామకం చేపట్టాలన్నారు. పార్టీ సభ్యత్వాల నమోదును పెద్దఎత్తున చేపట్టాలన్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వారి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని తెలిపారు.
పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్లు వీరే.. నిజామాబాద్ - రావుల చంద్రశేఖర్ రెడ్డి, చేవేళ్ల-బక్కని నర్సింహులు, హైదరాబాద్-అరవింద్ కుమార్ గౌడ్, ఖమ్మం- కాట్రగడ్డ ప్రసూన, నల్లగొండ-బంటు వెంకటేశ్వర్లు, కరీంనగర్-నన్నూరి నర్సిరెడ్డి, మల్కాజ్ గిరి- తిరునగరి జ్యోత్స్న, సికింద్రాబాద్-సామా భూపాల్ రెడ్డి, వరంగల్-బండిపుల్లయ్య, మహబూబాబాద్-అజ్మీరా రాజునాయక్, మెదక్-ఏకే గంగాధర్, నాగర్ కర్నూల్-జక్కలి ఐలయ్య యాదవ్, జహీరాబాద్-షేక్ ఆరీఫ్ హహమ్మద్, భువనగిరి-తాళ్లూరి జీవన్ కుమార్, పెద్దపల్లి-వెంజల్ల కిశోర్ బాబు, ఆదిలాబాద్-కనగాల సాంబశివరావు, మహబూబ్ నగర్-నిరంజన్ ముదిరాజ్‌లను నియమించారు.