- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shiva Sena Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
దిశ, తెలంగాణ బ్యూరో: క్రీడారంగా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకుంటున్నదని స్పోర్ట్స్ అథారిటీ(Telangana Sports Authority) చైర్మన్ శివసేనారెడ్డి(Shiva Sena Reddy) తెలిపారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ(Telangana Sports Authority) కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మితమైన స్పోర్ట్స్ విలేజ్(Sports Village)ను తిరిగి స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించడంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని రంగాల మాదిరిగానే క్రీడారంగంలో సమూల మార్పులతో పాటు క్రీడారంగా అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారన్నారు. వైఎస్ పాలనలో నిర్మించిన ఈ స్పోర్ట్స్ టవర్ 2007లో నిర్వహించిన వరల్డ్ మిలిటరీ గేమ్స్‌తో పాటు ఎన్నో జాతీయ అంతర్జాతీయ పోటీల సందర్భంగా క్రీడాకారుల వసతికి ఎంతో ఉపకరించిందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో వైద్యారోగ్య శాఖ(Department of Health)కు అప్పగించి దానిని నిర్వహణ మర్చిపోయిందని విమర్శించారు.
క్రీడారంగా అభివృద్ధిని విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వం క్రీడాకారులు క్రీడాభిమానులు ఎంత నిరసన వ్యక్తం చేసినా పట్టించుకోకుండా, స్పోర్ట్స్ విలేజ్‌ను సంబంధం లేని శాఖకు అప్పగించడం బాధాకరమన్నారు. క్రీడారంగా అభివృద్ధి కోసం ప్రభుత్వం నూతన క్రీడా విధానాన్ని అవలంభించడంతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం మంచి పరిణామం అని అన్నారు. రాబోయే రోజుల్లో పలు జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలకు హైదరాబాద్ వేదిక కానున్నదన్నారు. సీఎం ఇస్తున్న ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని అన్నారు.