గుండెపోటుతో వైద్య విద్యార్ధిని మృతి

by GSrikanth |
గుండెపోటుతో వైద్య విద్యార్ధిని మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. చిన్నాపెద్దా అనే తేడాలు అందరూ హఠాన్మరణం చెందుతున్నారు. నిజామాబాద్‌లో మరొకరు గుండెపోటుతో మృతిచెందారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూజితా రెడ్డి(24) అనే వైద్య విద్యార్థిని ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లింది. అక్కడే పది రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందింది. సోమవారం ఆమె మృతదేహాన్ని స్వస్థలమైన మల్కాపూర్ (ఏ)కు తీసుకురావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పూజితా రెడ్డి ఖమ్మంలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో బీడీఎస్‌ పూర్తి చేసింది. అనంతరం పీజీ చదివేందుకు ఈ ఏడాది జనవరి 26న కెనడాకు వెళ్ళింది.

Advertisement

Next Story