- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఈ నెల 12 నుంచి రైతులకు పంట సాయం అందిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలపై ఆయన స్పందించారు. అకాల వర్షాల కారణంగా చనిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. అలాగే నష్టపోయిన పంటకు రూ. 10 ఇస్తామని చెప్పారు. అటు కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందిస్తామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. వర్షాలతో తడిపోయిన పంటలను చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామన్నారు.
పంట నష్టం పరిహారంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల మాటలను రైతులు నమ్మొద్దని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. తెలంగాణలో మాత్రమే పంట నష్టంకు రూ. 10 వేలు ఇస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఎకరాలు రూ.7 వేలు నుంచి రూ. 7,500 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. అలాగే తడిసిన వడ్లను కూడా తెలంగాణలోనే కొంటున్నారని.. ఇతర రాష్ట్రాల్లో కొనడంలేదని ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు నాటకాలాడుతున్నారని, వాళ్లు పరిపాలించే రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారో రైతులు ప్రశ్నించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు నిచ్చారు.