Breaking News : మయోనైజ్ బ్యాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

by M.Rajitha |
Breaking News : మయోనైజ్ బ్యాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్న మయోనైజ్(Mayonnaise) ను రాష్ట్రంలో నిషేధిస్తూ తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఫుడ్ సేఫ్టీ(Food Safty) అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarasimha) సమావేశం అయిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని నందినగర్(Namdinagar) లో మోమోస్(Momos) లో మయోనైజ్ తిని ఓ మహిళ మృతి చెందగా.. 20 మందిదాకా ఆసుపత్రుల పాలయ్యారు. అలాగే నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో కూడా తరుచూ ఇలాంటి ఘటనలు జగరడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని వందల రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ మీద దాడులు చేస్తూ.. భారీగా ఫైన్ విధించాయి. కొన్నిటిని సీజ్ కూడా చేశాయి. ప్రతిచోట పాడైన మయోనైజ్ ఉండటాన్ని అధికారులు గమనించారు. ఈ విషయాలన్నిటిని నేడు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వివరించగా.. తక్షణమే రాష్ట్రంలో మయోనైజ్ బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆహారప్రియులు ఇష్టంగా తినే మయోనైజ్ ను మండి బిర్యానీలు, కబాబ్, పిజ్జాలు, బర్గర్లు వంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా తింటారు. అయితే దీనిని గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో తయారు చేస్తారు. ఇది ఉడికించని పదార్థం కావడం వలన హానికర బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెందుతుంది.

Advertisement

Next Story

Most Viewed