- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
దిశ, వెబ్‌డెస్క్: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డ్వాక్రా మహిళలకు త్వరలో వడ్దీలేని రుణాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. చాలా కాలం నుంచి జీతాలు రావడం లేదని ఆశా వర్కర్లు విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. వారికి జీతాలు అందేలా చూస్తానని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అంతేకాదు.. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని విమర్శించారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, స్వయం సహాయక బృందాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, రెండో ఏఎన్‌ఎంల వంటి వారికి ప్రతి నెల 1వ తేదీన బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.