రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీలో మరికొన్ని సేవలు..!

by Satheesh |
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీలో మరికొన్ని సేవలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గుండె సమస్యల నిర్ధారణకు నిర్వహించే యాంజియోగ్రామ్ పరీక్షలు ఇక నుంచి ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా చేపించుకోవచ్చు. దీంతో పాటు పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొత్తగా ఆరోగ్యశ్రీలో మరో 65 కొత్త చికిత్స విధానాలను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాటు ఆరోగ్య శ్రీలో ప్రస్తుతం ఉన్న 1672 చికిత్స విధానాల్లో 1375 ప్రోసీజర్లకు ప్యాకేజీ ధరలు పెంచారు. ఇందుకు అదనంగా మరో వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా, ఈ నిధులను రిలీజ్ చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ పథకం కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉండగా, వీరికి ఈ స్కీమ్ ద్వారా రూ.10 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1402 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి.

Advertisement

Next Story