- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్‌పై ప్రభుత్వం సరికొత్త తరహా యుద్ధం
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. డ్రగ్స్ భూతంపై ఎక్కడికక్కడే ఉక్కుపాదం మోపుతూ.. పెడ్లర్లను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపుతున్నారు పోలీసులు. వీకెండ్స్ లోనూ పబ్బులు, ఇతర ప్రైవేటు పార్టీలపై రైడ్స్ చేసి.. డ్రగ్స్ అమ్మేవారిని, తీసుకుంటున్నవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అంతేకాదు.. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోనూ క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. గంజాయి రవాణాపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఏ వాహనాన్ని వదలకుండా తనిఖీలు చేస్తూ.. కిలోల కొద్దీ మత్తుపదార్థాలను సీజ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులను డ్రగ్స్ సోల్జర్స్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ టీచర్లు, ప్రిన్సిపల్, రెవెన్యూ అధికారులను సోల్జర్లుగా.. పారామెడికల్ సిబ్బంది, వైద్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలను కమిటీలుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. డ్రగ్ సోల్జర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
- Tags
- Telugu News
- drugs