Telangana Gold Man : 5కేజీల నగలతో శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గోల్డ్ మ్యాన్

by Y. Venkata Narasimha Reddy |
Telangana Gold Man : 5కేజీల నగలతో శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గోల్డ్ మ్యాన్
X

దిశ, వెబ్ డెస్క్ : భారీ బంగారు ఆభరణాలు ధరిస్తూ తెలంగాణ గోల్డ్ మ్యాన్(Telangana Gold Man)గా గుర్తింపు పొందిన హైదరాబాద్ కు చెందిన కొండ విజయ్ కుమార్ (Konda Vijay Kumar) తిరుమల శ్రీవారి(Lord of Tirumala)ని దర్శించుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. రూ. 4 కోట్ల రూపాయల విలువ చేసే 5 కేజీల బంగారు ఆభరణా(5 kg of Jewelry)లు ధరించి గోల్డ్ మ్యాన్ విజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలోనూ విజయ్ కుమార్ దాదాపు 10 కిలోల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. బంగారు వాచీలు, ఉంగరాలు, మెడలో భారీ స్వర్ణాభరణాలతో ఆలయానికి వచ్చిన విజయ్ కుమార్ తో భక్తులు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు.

గతంలో హకీ చైర్మన్ గా వ్యవహరించిన విజయ్ కుమార్ హోప్ ఫౌండేషన్ ద్వారా పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామి ఆశీస్సులతో ఏలాంటి విరాళాలు సేకరించకుండా సేవ చేసే అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు. గత మూడేళ్లుగా తమ కుటుంబ సభ్యులు, హోప్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి దర్శించుకుంటున్నట్లు కొండ విజయ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed