ప్రమాదకరంగా ఆర్డీఎస్ డీ-30..తెగిపోతే భారీ నష్టమే...

by Aamani |
ప్రమాదకరంగా ఆర్డీఎస్ డీ-30..తెగిపోతే భారీ నష్టమే...
X

దిశ, మానోపాడు(అలంపూర్) : సాగునీటి అధికారుల నిర్లక్ష్యమా... గ్రామస్తులు చేసుకున్న పాపమా అన్నట్లుగా మారింది ఈ గ్రామ పరిస్థితి. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని, సాగునీరు అడుగు మేరకు గ్రామంలోకి ప్రవహిస్తున్న చూసి చూడనట్టు వివరించడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితి ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఆర్డీఎస్ ఢీ 30 కాలువ ప్రమాదభరితంగా మారింది. ఎప్పుడు తెగిబోతుందో తెలియని విధంగా ఆర్డీఎస్ కాలువ సాగునీరు రోడ్డెక్కి అడుగు మేరకు పారుతుంది. అధికారులకు ఉదయం నుంచి ఫోన్ చేసిన స్పందించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్డీఎస్ కాలువలో సిల్టు పూర్తిగా నిండి పోవడం ... వార బంధికి లేకుండా ఇష్టం వచ్చినట్లు నీళ్లు వదలడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చేస్తున్నారు. సాగునీరు రోడ్డెక్కి ప్రవహిస్తుండడంతో గ్రామంలోకి అడుగు మేరకు నీళ్లు వస్తున్నాయని, గ్రామం నుండి జాతీయ రహదారి వైపు వెళ్లాలంటే ప్రమాదకరంగా నీళ్లు రోడ్డుపై నిల్చుని ఉన్నాయని రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్లాల్లో వేసుకున్న వరివాములు ఎండబెట్టుకున్న మిర్చి కూడా చాలామంది రైతుల తడిసిపోయిందని వాపోతున్నారు. ఆర్ డి ఎస్ డి 30 కాలువ తెగిపోతే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత 15 రోజుల క్రితం ఇదేవిధంగా నీళ్లు ప్రవహించిన అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శుక్రవారం మాత్రం కాలువ పూర్తిగా తెగిపోయే విధంగా సాగునీరు రోడ్డెక్కి పారుతుందని అధికారులు విని వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story