- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాలేజీలో ప్రొఫెసర్లను నియమించండి
దిశ, ఆసిఫాబాద్ : కాలేజీలో ప్రొఫెసర్లు లేక ఆన్లైన్ క్లాసులు వింటున్నామని మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం మళ్లీ రెండోరోజు కళాశాల ఎదుట బైఠాయించి ప్రొఫెసర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడారు. మెడికల్ కాలేజీలో ఖాళీల కొరత వేధిస్తోంది. కాలేజీలో మొత్తం 27 మంది ప్రొఫెసర్లు ఉండగా కేవలం ఇద్దరే పనిచేస్తున్నారు.
మొదటి సంవత్సరం విద్యా ర్థులకు బోధించేందుకు 30 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాల్సి ఉండగా కేవలం ఒక్కరే ఉండటంతో బోధన పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా మారిందని వాపోయారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బోధించేందుకు 58 మంది ప్రొఫెసర్లు కావాల్సి ఉండగా నలుగురే ఉన్నారని చెప్పారు. తమను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏడాదిలో దాదాపు రెండు నెలల పాటు ఆన్‌లైన్‌లోనే క్లాసులు వింటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టులు భర్తీకి పలుమార్లు నోటిఫికేషన్ వేసినా జిల్లాకు వచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని కళాశాల యాజమాన్యం చెబుతున్నారు.