సినిమాలపై సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

by Mahesh |   ( Updated:2025-01-05 10:46:43.0  )
సినిమాలపై సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్(Ananth Sriram) మరోసారి సంచలన వ్యాఖ్యలు(Sensational comments) చేశారు. మన దీక్ష దేవాలయ రక్ష పేరుతో విజయవాడలో విశ్వహిందూ పరిషత్(Vishwa Hindu Parishad), హిందూ సంఘాలు హైందవ శంఖారావం(Hindava Sankharavam) బహిరంగ సభ(Public meeting)ను ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు తెలుగు రాష్ట్రలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ (Ananth Sriram) మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో హైందవ దర్మం(Hindu Dharma)పై దాడి(attack) జరుగుతుందని, ముఖ్యంగా సినిమాల్లో హైందవ పురాణాలను వక్రీకరిస్తున్నారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ప్రకారమే సినిమాల్లో హైందవ ధర్మ హననం జరుగుతోందని, కొందరు అన్యమతస్తుల ప్రవర్తన ఇబ్బమంది పెడుతోందని గుర్తు చేశారు. అలాగే కల్కీ సినిమాలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారని, ఆయన్ను శూరుడు అంటే ఎవరు ఒప్పుకోరని.. సినిమాల్లో పురాణాలపై ఇలాంటి వక్రీకరణలు చూసి నేనే సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చారు. అలాగే ఎవరు చేసిన తప్పును తప్పు అని చేప్పాలస్సిందేనని సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed