- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM రేవంత్‌కు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ కీలక విజ్ఞప్తి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వహించిన వార్షిక పబ్లిక్ పరీక్షలలో వివిధ స్థాయిలలో విధులు నిర్వహించిన వారికి వెంటనే రెమ్యూనరేషన్ చెల్లించాలని కోరుతూ సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆన్లైన్ ద్వారా విజ్ఞప్తి చేసినట్టు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వి. శ్రీనివాస్ డాక్టర్ కుప్పిశెట్టి సురేష్ తెలిపారు. 2024 ఇంటర్ పబ్లిక్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించడం జరిగిందని, 2024 థియరీ పరీక్షల్లో వివిధ విధులు నిర్వహించిన వారికి ఇంతవరకు రెమ్యూనరేషన్ అందలేదని తెలిపారు.
దీనివల్ల ఉద్యోగులు చాలా ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఆన్లైన్ విధానం పెట్టి ఐదారు నెలల వరకు రెమ్యూనరేషన్ చెల్లించడం లేదని, దీనివల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుపుతూ, ఈ విషయాన్ని పరిష్కరించవలసిందిగా గతంలో అనేకసార్లు విద్యాశాఖ కార్యదర్శికి, ఇంటర్ బోర్డు కార్యదర్శికి, తమ సంఘం నుంచి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు.