- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
rainfall : అకాల వర్షం...అన్నదాతకు తీవ్ర నష్టం..
దిశ, కాటారం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురిసిన అకాల వర్షం పాటల మండలంలో రైతులను నిండా ముంచింది. బుధవారం ఉదయం ఓ మోస్తారు వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లాలో కాటారం, భూపాలపల్లి మండలాల్లో వర్షపాతం 11.2 మీమీ వర్షపాతం నమోదయింది. జిల్లాలో అత్యధికంగా కాటారం మండలంలో 8.6 మీమీ, భూపాలపల్లిలో 2.6 మీమీ వర్షం కురిసింది. పత్తి, వరి పంటలు రైతుకు చేతికందే సమయంలో కురిసిన వర్షంతో రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ముఖ్యంగా పత్తి తీసే సమయంలో కురిసిన ఈ వర్షంతో పత్తి ధూది అంతా నల్లబడే అవకాశం ఉంది. పత్తి మొక్కల పూలు మొత్తం రాలిపోనున్నాయి.
వరి పంట కోసే సమయంలో కురిసిన వర్షంతో అంతా పంట నేల పాలయింది. కురిసిన అకాల వర్షం రైతులకు ఎంతో నష్టం చేకూర్చిందని, ఇప్పటికే దిగుబడులు లేక అతలాకుతలం అవుతున్న రైతులకు ఈ వర్షం మరింత కృంగదీస్తుంది. పత్తి, వరి పంటలు సేద్యం చేసే సమయంలో భారీ వర్షాలు కురిసి పంట ఎదుగుదల లేకపోవడం పత్తి చేలలో గడ్డి ఏపుగా పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ ఉన్న కాస్త పత్తి మొక్కలకు ఉత్పత్తి అయిన దూదిపూలు తీసుకునే సమయంలో కురిసిన వర్షంతో పంట నేలరాలి పోతున్నాయి. బుధవారం ఆకాశమంతా మేఘావృతమై ఉండడం నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు ఏం జరుగుతుందోనని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.