పారిస్ ఒలంపిక్స్‌కు తెలంగాణ డెలిగేషన్

by Gantepaka Srikanth |
పారిస్ ఒలంపిక్స్‌కు తెలంగాణ డెలిగేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పారిస్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఒలంపిక్స్ సందర్శనకు తెలంగాణ నుంచి ప్రత్యేక బృందం వెళ్ళింది. తెలంగాణ తరఫున క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వెళ్ళిన క్రీడాకారులకు నైతిక మద్దతు అందించడంతో పాటు అక్కడి స్టేడియంలను సందర్శించడం కూడా ఒక టాస్క్. ఒలంపిక్స్ పోటీల కోసం చేసిన ఏర్పాట్లు, భవిష్యత్తులో ఒలంపిక్స్ నిర్వహణకు ఉన్న అవకాశాల పరిశీలన, వివిధ దేశాలు క్రీడల్లో అభివృద్ధి సాధించడానికి అనుసరిస్తున్న విధానాలు తదితరాలపైనా స్టడీ చేస్తున్నది. పతకాల పట్టికలో వివిధ దేశాలు ముందంజలో ఉండడానికి దోహదం చేస్తున్న కారణాలు పరిశీలించడంతో పాటు భవిష్యత్తులో తెలంగాణ సైతం ఆ స్థాయికి చేరుకోడానికి అనుసరించాల్సిన పద్ధతులను స్టడీ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకురావాలని భావిస్తున్నందున దాన్ని తయారుచేయడానికి ముందే క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పోర్ట్స్ అథారిటీ నిర్ణయించుకున్నది.

అందులో భాగంగా పారిస్ ఒలంపిక్స్ సందర్శన కోసం తెలంగాణ ప్రతినిధి బృందం వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న క్రీడా పాలసీతోపాటు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ కోసం తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ సందర్శనతో ఆలోచనలు వస్తాయని, అవగాహన పెరుగుతుందని ఈ టీమ్ భావిస్తున్నది. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి నేతృత్వంలో వెళ్ళిన ఈ బృందంలో అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ (వైస్ చైర్‌పర్సన్) సోని బాలాదేవీ, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఐపీఎస్ ఆఫీసర్ ప్రకాశ్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story