T Congress : కొత్త రథసారథిపై తెలంగాణ కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
T Congress : కొత్త రథసారథిపై తెలంగాణ కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కార్యకర్తల హుషారు, అభిమానుల జోరు, మిన్నంటిన నూతన రథసారథి ప్రమాణ స్వీకారోత్సవ సంబరాలు అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర వీడియో పంచుకుంది. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఘనమైన ఆహ్వానం పలికారని పేర్కొంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎంపీలు, ఇన్చార్జ్ ఏఐసీసీ సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు భాగస్వామ్యమయి నూతన అధ్యక్షుడికి వారి మద్దతును తెలిపారన్నారు.

సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయన ప్రయాణం, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వరకు నిరంతరం పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తూ, తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలన్నీ చిత్తశుద్ధితో నెరవేరుస్తూ, అంచెలంచెలుగా ఎదిగిన ఆయన తీరు నేటి కాంగ్రెస్ యువ తరానికి ఎంతో ఆదర్శం అని పేర్కొంది. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని నిర్మాణాత్మకంగా నడిపించి ప్రశంసలు పొందారన్నారు. నేడు అధికార పార్టీగా, ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడిగా తన బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తారని బలంగా ఆకాంక్షిస్తూ, తెలంగాణ కాంగ్రెస్ తరపున నూతన టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని ట్వీట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed