- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి తెరపైకి ‘అగ్నిపథ్’ వివాదం!
దిశ, డైనమిక్ బ్యూరో: భారత సైనిక దళాల్లో నియామకాలకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం అగ్నిపథ్ రాజేసిన అగ్గి కార్చిచ్చుగా మారి దేశమంతటినీ కమ్మేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంతో మంది యువకులు పథకాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టీ కేంద్రానికి భారీగా ఆస్తి నష్టం కలిగించారు. మరోవైపు పదుల సంఖ్యలో నిరసనల్లో యువకులు చనిపోయారు. తర్వాత దిగొచ్చిన కేంద్రం పథకంలో కొన్ని మార్పులు చేయడంతో నిరసనలు తగ్గాయి. తాజా మరోసారి అగ్నిపథ్ వివాదం తెరపైకి వచ్చింది. అగ్నిపథ్ పథకంపై తెలంగాణ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలు చేసింది.
సైన్యంలో దేశ సేవ కోసం ప్రాణాలైనా ఇస్తాము. దేశం సరిహద్దుల్లో కొట్లాడుతాము. పెద్దయ్యాక సైనికుడిని అవుతానని కలలుగనే యువత ఆశలపై నీళ్లు చల్లింది బీజేపీ ప్రభుత్వమని టీపీసీసీ అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి అన్నారు. అగ్నిపథ్ స్కీం ద్వారా 16 నుండి 21 సంవత్సరాల వయసు లోపు వారిని సైనికులుగా తీసుకొని, కేవలం నాలుగు ఏళ్ళ కాంట్రాక్ట్ తర్వాత, దేశానికి సేవ చేసిన యువతకు ఎటువంటి హామీ లేకుండా బయటకు పంపిస్తుందని ఆరోపించారు.
గతంలో సైనికులుగా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరే అవకాశం ఉండేదని, రిటైర్ అయిన తర్వాత వారికి పెన్షన్, ఇతర ప్రయోజనాలు ఉండేవన్నారు. కానీ ఈ అగ్నిపథ్ స్కీం ద్వారా సైనికులకు ఈ ప్రయోజనాలు లేకుండా చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ స్కీంను రద్దుచేసి పాత పద్ధతిని కొనసాగిస్తుంది. కాబట్టి యువత ఆలోచన చేసి ఇలాంటి తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.