- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Congress: టీ కాంగ్రెస్ సర్కారుపై ఛత్తీస్‌గఢ్ ఫోకస్..! పార్టీ ప్రోగ్రాంలు, ప్రభుత్వ స్కీమ్‌లపై ఆరా
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ఛత్తీస్‌గఢ్ హస్తం పార్టీ అధ్యయనం చేస్తున్నది. పార్టీ కార్యక్రమాలు, సర్కారు స్కీమ్‌ల అమలు తీరును పరిశీలిస్తున్నది. స్వయంగా అక్కడి పీసీసీ హైదరాబాద్‌కు వచ్చి అబ్జర్వ్ చేస్తున్నది. దీనిలో భాగంగానే ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు దీపక్ బైజ్.. తెలంగాణ సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను ప్రత్యేకంగా కలిశారు. పార్టీ కార్యక్రమాలపై మహేశ్ గౌడ్‌ను, ప్రభుత్వ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్‌పై సీఎం రేవంత్‌ను అడిగి తెలుసుకున్నారు. పార్టీ సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవడంపై చర్చించారు. దీంతో పాటు ఆ రాష్ట్రంలో అధికార పార్టీపై చేయాల్సిన ఒత్తిడి, ప్రజల్లో మైలేజ్ పొందేందుకు పాటించాల్సిన వ్యూహాలపై కూడా వివరాలు సేకరించారు.
నేతల మధ్య సమన్వయం, పార్టీని మరింత పటిష్టంగా తయారయ్యేందుకు వ్యవహరించాల్సిన విధానాలపై కూడా ఛత్తీస్‌గఢ్ పీసీసీ చీఫ్ ఆరా తీస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటూ సీరియస్‌గా స్టడీ చేస్తున్నారు. ఏఐసీసీ ఆదేశం మేరకే ఆయన అధ్యయనం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో టాక్. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు త్వరలో కొత్త పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కానున్నది. దీంతో కార్యవర్గం ఎలా ఉండాలి? కమిటీ పరిమితులు, పార్టీ యాక్టివిటీస్, ప్రణాళికలు, సెంట్రల్, స్టేట్ అధికార పార్టీలపై పోరాటం చేయాల్సిన తీరుపై కూడా ఆ రాష్ట్ర పీసీసీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నది. ఇవన్నీ భవిష్యత్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యేందుకు ఉపయోగపడతాయని టీపీసీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ప్రతిపక్షంగా పోరాటం ఎలా..
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. పీసీసీ చీఫ్‌గా ఆయన ఆదేశాలతో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పోరాటం చేసింది. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్(టీఆర్ఎస్)ను ఇరకాటంలో పెట్టేందుకు వివిధ విధానాలు, పద్ధతులను పాటించింది. అప్పటి సర్కారు తీసుకున్న నిర్ణయాల్లోని తప్పిదాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించేందుకు వినూత్నమైన నిరసనలు, ఆందోళనలు నిర్వహించింది. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు ఆదరణ పెరిగేందుకు మాజీ సీఎం కేసీఆర్‌పై పెద్ద యుద్ధమే చేశారు. రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, మహిళా సంఘాల సవాళ్లను ప్రధానంగా ఎత్తుకొని బీఆర్ఎస్ సర్కారుపై పోరాటం చేశారు.
గత ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్‌లలో తప్పిదాలు, ప్రాజెక్టులలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు వంటివన్నీ ప్రజల్లోకి సులువుగా తీసుకెళ్లగలిగారు. ఇవన్నీ ఓ ప్రణాళికాబద్ధంగా అమలు చేయడంతో ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి కాంగ్రెస్‌కు వేవ్ మొదలైంది. ఇది మౌత్ పబ్లిసిటీగా మారి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ఊహించని ఆదరణ లభించింది. తద్వారా పార్టీ అధికారంలోకి వచ్చింది. పవర్‌లోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత పీసీసీ చీఫ్‌గా మహేశ్ గౌడ్ నియామకమయ్యారు. ఆయన కూడా పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి అంశాలను గమనంలోకి తీసుకున్నది.
పవర్‌లోకి వచ్చేందుకే
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ పవర్‌లో ఉన్నది. కేంద్రంలోనూ అదే పార్టీ ఉన్నది. దీంతో ఆ పార్టీపై యుద్ధం ఎలా చేయాలని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. పైగా తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందున్న పీసీసీ అధ్యక్షుడే ఇప్పుడు సీఎంగా ఉన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఫైట్ చేయాల్సిన తీరు, అధికార పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు తీసుకోవాల్సిన పాలసీలు, పవర్ పార్టీని డీమోరల్ చేసేందుకు ఎత్తుకోవాల్సిన అంశాలను ఛత్తీస్‌గఢ్ పీసీసీ చీఫ్ స్పష్టంగా తెలుసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందున్న పీసీసీ ఈ విషయంలో సక్సెస్ పుల్ అనే ముద్ర ఉన్నది. దీంతోనే ఛత్తీస్‌గఢ్ పీసీసీ ఈ స్టేట్‌పై ఫోకస్ పెట్టారని పార్టీలోకి ఓ కీలక నేత వెల్లడించారు.