తెలంగాణ CM రేవంత్ రెడ్డి తొలి సంతకం.. అభయహస్తం 6 గ్యారంటీలు ఇవే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-07 09:39:39.0  )
తెలంగాణ CM రేవంత్ రెడ్డి తొలి సంతకం.. అభయహస్తం 6 గ్యారంటీలు ఇవే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల ప్రచారం సందర్భంగా సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలనే అభయహస్తం పేరుతో మేనిఫెస్టోలో ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తొలి సంతకం ఆరు గ్యారంటీలపైనే చేస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఆరు గ్యారంటీలు ఇవే :

మహాలక్ష్మీ పథకం

మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సాయం

ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం

ప్రతి ఇంటికి రూ. 500 కే గ్యాస్ సిలిండర్

రైతు భరోసా

రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి ప్రతి ఏటా రూ. 15,000 చొప్పున పంట పెట్టుబడి సాయం

వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12,000 ఆర్థిక సాయం

వరి పంటకు కనీస మద్దతు ధరను ఇవ్వడంతో పాటు అదనంగా ఒక్కో క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్

గృహ జ్యోతి

ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

ఇందిరమ్మ ఇండ్లు

సొంతిల్లు లేని కుటుంబాలకు ఇంటి స్థలం, రూ. 5 లక్షల మేరకు ఇల్లు కట్టుకోడానికి ఆర్థిక సాయం

తెలంగాణ ఉద్యమకారులకు 250 చ. గజాల ఇంటి స్థలం

యువ వికాసం

విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా పేరుతో ఆర్థిక సాయం

ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్

చేయూత

అర్హులైన కుటుంబాలకు నెలకు రూ. 4,000 చొప్పున పింఛన్

రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా స్కీమ్ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ. 10 లక్షల వరకు వైద్య చికిత్స సౌకర్యం

Advertisement

Next Story

Most Viewed