- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేను మాట ఇస్తే.. నా సొంత అన్నకు మాటిచ్చినట్టే లెక్క.. సీఎం రేవంత్ రెడ్డితో ఓ మహిళ
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ చెల్లెమ్మ మంచిమాట.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ కార్యక్రమంలో జరిగిన వీడియో ప్రజలతో పంచుకున్నారు. నీ పిల్లలు ఏమి చదువుతున్నారు.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ మహిళను తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రశ్నించారు. సదరు మహిళ సమాధానం ఇస్తూ.. నా పిల్లలు చదువుకుంటున్నారు సార్. ఒక బాబు ల్యాబ్ టెక్నీషియన్, ఇంకో బాబు బీటెక్ చేస్తున్నాడని చెబుతుంది.
ఇద్దరు కొడుకులే.. మరి కట్నం తీసుకుంటావా మీ కోడుకులకు పెళ్లి చేస్తే? అని సీఎం రేవంత్ నవ్వుతూ మహిళను అడిగారు. దీంతో ఆ మహిళ సమాధానమిస్తూ.. తన కొడుకులకు పెళ్లి చేస్తే కట్నం తీసుకోనని చెప్పింది. మాట ఇస్తున్నావా? అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాట ఇస్తున్నాను సార్.. మీకు మాట ఇచ్చానంటే మా అన్నకు మాట ఇచ్చినట్లే.. అని సదరు మహిళ ఆప్యాయంగా సీఎంకు మాట ఇచ్చింది.
అయితే జవహార్‌నగర్‌లో తనకు చాలా మంది తెలుసని, తాను ఈ విషయం తెలుసుకుంటానని నవ్వుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆ మహిళతో చెప్పారు. మీరు బాగా తెలుసు, మీరు ఎప్పుడు వచ్చిన జవహార్ నగర్‌లో ఉంటానని మహిళ సీఎంకు నవ్వుతూ సమాధానం ఇస్తుంది. మీరందరూ ఓటు వేశారు. మీ కొడుకు పెళ్లి అప్పుడు తెలుసుకుంటాను.. కట్నం తీసుకున్నావా? లేదా? అని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అంటారు. దీంతో ఆ కార్యక్రమంలో సీఎం నవ్వులు పూయించారు.