బిగ్ బ్రేకింగ్: ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ

by Satheesh |   ( Updated:2023-09-26 11:45:23.0  )
బిగ్ బ్రేకింగ్: ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 29వ తేదీన తెలంగాణ కేటినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ నూతన సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరగనుంది. గవర్నర్ కోటాలో రాష్ట్ర కేబినెట్ నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంతో ఈ అంశంపై ఈ భేటీలో మంత్రిమండలి చర్చించనుంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై కేబినెట్ చర్చ జరపనుంది. ఈ రెండు అంశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. ఎన్నికల సమీపిస్తోన్న వేళ కేసీఆర్ కేబినెట్ భేటీ నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story