- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telangana BJP: కొడంగల్‌లో కలెక్టర్‌పై దాడి.. తెలంగాణ బీజేపీ రియాక్షన్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్(Vikarabad Collector Prateek Jain)కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి వెళ్లిన ఆయనకు నిరసన తెగ తగిలింది. దుద్యాల మండలం(Dudyal Mandal)లోని లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ(Pharma Company) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్‌పై కంపెనీ కారణంగా భూములు కోల్పోతున్న రైతుల ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే కలెక్టర్‌ను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజాగా.. ఈ పరిణామంపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) స్పందించింది.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఎదురుతిరుగుతున్నారని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) ఒంటెద్దు పోకడే ఇందుకు కారణమని తెలిపింది. నియంత విధానాల కారణంగా గ్రామాల్లో పర్యటించలేక అధికారులు, కలెక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించింది. మూడు ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు.