- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana BJP: సీఎం రేవంత్ సవాల్ స్వీకరిస్తూ టీ.బీజేపీ సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: మూసీ(Musi) పరివాహక ప్రాంతంలో గడపాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విసిరిన సవాల్‌ను తెలంగాణ బీజేపీ(Telangana BJP) స్వీకరించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి అసెంబ్లీల వారీగా బీజేపీ నేతలు పాదయాత్రలు చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ పాదయాత్రకు సిద్ధమయ్యారు. పాదయాత్రలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు.
అంతేకాదు.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూ ఈనెల 15వ తేదీన లేదా? 16వ తేదీన మూసీ పరివాహక ప్రాంతంలో బస చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) నేతృత్వంలో లీడర్లు బస చేయనున్నారు. కాగా, ఇటీవల మూసీ పునరుజ్జీవాన్ని వ్యతిరేకించే బీఆర్ఎస్, బీజేపీ నేతలు మూడు నెలలపాటు ఆ ప్రాంతంలో నివాసం ఉంటే సుందరీకరణ అంశాన్ని పక్కనపెడతానని రేవంత్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ బీజేపీ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.