- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చుగ్ ను కలిసిన గూడూరు నారాయణ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ ను ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చుగ్ ను పోచంపల్లి పట్టు శాలువాతో గూడూరు నారాయణ రెడ్డి సత్కరించారు. ఇదిలా ఉండగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ ద్వారా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై చుగ్ నారాయణరెడ్డిని అభినందించారు. చేనేతలకు ఆసు యంత్రాలు, రజకులకు ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు, నాయీ బ్రాహ్మణులకు అత్యాధునిక వృత్తి యంత్రాలు అందించడమే కాకుండా 800 మంది పేద నిరుద్యోగ యువతకు ఎస్సై, కానిస్టేబుల్స్ ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్, వసతి కల్పించడం అభినందనీయమని చుగ్ కొనియాడారు.
ఎస్సై, కానిస్టేబుల్స్ పరీక్షల్లో దాదాపు 280 మంది ప్రిలిమినరీ, ఈవెంట్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్ష కోసం అర్హత సాధించడం గొప్ప విషయమన్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ కి అతి సమీపంలో ఉన్న భువనగిరి అసెంబ్లీలో ఐటీ ఉద్యోగ రూపకల్పనలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, కేసిఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అభివృధి పనులు చేపట్టలేదని చుగ్ కు నారాయణ రెడ్డి వివరించారు.