- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేలకు టార్గెట్? అన్వార్డ్ ఫ్లైట్.. రిటర్న్‌లో ట్రైన్
దిశ, జగిత్యాల ప్రతినిధి: ఢిల్లీ లిక్కర్ స్కాం దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తుంది. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో హాజరుకావాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా నిలబడేందుకు పెద్ద ఎత్తున అధికార పార్టీ లీడర్లు ఢిల్లీ వెళ్లారు. గ్రామస్థాయిలోని గల్లీ లీడర్ల నుండి మొదలుకొని వార్డ్ మెంబర్లు, సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు, ఎమ్మెల్యేల వరకు అందరూ ఢిల్లీ బాట పట్టారు.
రెండోసారి ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను విచారణకు పిలవడంతో గులాబి శ్రేణుల్లో కలవరం మొదలైనట్లుగా తెలుస్తుంది. కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్న దృష్ట్యా బీఆర్ఎస్ నాయకులు కవితకు మద్దతుగా ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే కవిత విచారణకు హాజరు కాలేనని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించిన తర్వాతనే విచారణకు వస్తానని కవిత ఈడీ అధికారులకు తెలియజేశారు. ఈ పరిణామంతో ఢిల్లీ వెళ్ళిన నాయకులలో కొంతమంది తిరిగి ఇంటి బాట పట్టగా మరికొందరు ముఖ్య నాయకులు ఢిల్లీలోనే మకాం వేయనున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యేలకు టార్గెట్..?
లిక్కర్ స్కాంలో విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున మహిళలను తీసుకురావాలని ఎమ్మెల్సీ కవిత కార్యాలయం నుండి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు సూచనలు అందినట్టు సమాచారం. ఢిల్లీకి తరలించిన వారందరికీ ఎమ్మెల్సీ కవిత కార్యాలయం నుండే గ్రూప్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే ఒక్కో ఎమ్మెల్యే నియోజకవర్గం నుండి కనీసం 30 మంది మహిళా లీడర్లకు తగ్గకుండా వీలైనంత ఎక్కువ మందిని ఢిల్లీకి తరలించాలని ఆదేశాలు అందినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గంలోని మహిళా నాయకులపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ తరలించారాని ఢిల్లీకి వెళ్లిన ఓ మహిళ నాయకురాలు తెలిపింది. అందులో మరీ ముఖ్యంగా ప్రోటోకాల్ ఉన్న మహిళా నాయకులను ఆరోగ్యం సహకరించదని మొరపెట్టుకున్న వినకుండా తీసుకెళ్లారని విమర్శలు వస్తున్నాయి.
అన్వార్డ్ ఫ్లైట్.. రిటర్న్ ట్రైన్
కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు బుధవారం రాత్రి హైదరాబాద్ నుండి ఢిల్లీకి విమానంలో తరలి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన కొంతమంది నాయకులను రిటర్న్ జర్నీలో ట్రైన్‌కు పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వెళ్ళే అప్పుడు విమానంలో తీసుకువెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ట్రైన్ టికెట్లు బుక్ చేయడం పట్ల ఆయా నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఇదిలా ఉండగా మరికొంతమంది నాయకులు మాత్రం ఢిల్లీ మొత్తం తిరుగుతూ టూర్‌ను ఎంజాయ్ చేశామని చెప్తున్నారు. అప్ అండ్ డౌన్ టికెట్లతో పాటు ఉండడానికి హోటళ్లు, రిసార్ట్‌లను కూడా ఫ్రీగా ఏర్పాటు చేయడంతో ఎప్పుడు గల్లీ దాటి వెళ్ళని నాయకులు ఏకంగా ఢిల్లీకి వెళ్లే అవకాశం రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఢిల్లీకి వెళ్లిన నాయకులలో ఎక్కువగా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల వారు అధికంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉన్న లీడర్లంతా ఢిల్లీ బాట పట్టడంతో జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు కానరాకుండా పోయారు.
Also Read..
అప్పటి వరకు విచారణకు హాజరు కాలేను: ఈడీకి ఎమ్మెల్సీ కవిత మెయిల్