BREAKING: విషమంగా తమ్మినేని ఆరోగ్య పరిస్థితి.. హెల్త్ బులెటిన్ రిలీజ్..!

by Satheesh |   ( Updated:2024-01-16 15:34:42.0  )
BREAKING: విషమంగా తమ్మినేని ఆరోగ్య పరిస్థితి.. హెల్త్ బులెటిన్ రిలీజ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: గుండె పోటుకు గురైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం తమ్మినేని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తమ్మినేని గుండె, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. ఊపిరితిత్తుల నుండి నీరు బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, ఇవాళ తమ్మినేని ఖమ్మం జిల్లాలోని తన సొంత నివాసంలో గుండె పోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో తమ్మినేని వీరభద్రానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story