T Congress Tweet: 'పదేళ్లు అన్ని విధాల మోసం చేసి ఇప్పుడు ధర్నాలా?'

by Prasad Jukanti |
T Congress Tweet: పదేళ్లు అన్ని విధాల మోసం చేసి ఇప్పుడు ధర్నాలా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం రైతుల చుట్టూ తిరుగుతున్నది. రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జోష్ లో ఉండగా రుమమాఫీ ఇంకా చాలా మందికి కాలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. ఈ క్రమంలో ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో భాగంగా చేవెళ్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నారు. ఈ ధర్నా కార్యక్రమంపై టీ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించింది. గడిచిన పదేళ్లలో అన్నదాతకు సంకెళ్లు వేసిన పాలన బీఆర్ఎస్ దైతే అన్నదాతలను అక్కున చేర్చుకున్న పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొంది. బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ చూసిన అన్నదాల బలవన్మరణాలే కనిపించేవని, మీ పదేళ్ల పాలనలో రైతులను అన్ని విధాలుగా మోసం చేసిన మీరు నేడు ధర్నాలు చేస్తామనడం విడ్డూరంగా ఉందని విమర్శించింది. తాము రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, పండగలా రుణమాఫీ చేశామని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed