ఆరోగ్య పరిరక్షణకు స్విమ్మింగ్‌ దోహదం: ఆంజనేయ గౌడ్‌

by Satheesh |
ఆరోగ్య పరిరక్షణకు స్విమ్మింగ్‌ దోహదం: ఆంజనేయ గౌడ్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్య పరిరక్షణకు స్విమ్మింగ్ ఎంతగానో దోహదపడుతుందని శాట్స్ చైర్మన్ ఈడిగ ఆంజనేయగౌడ్ అన్నారు.స్విమ్మింగ్‌ క్రీడకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులను సైతం ప్రోత్సహిస్తుందని, అందుకు సాక్ష్యం స్విమ్మింగ్ క్రీడాకారులు సాధిస్తున్న విజయాలే అన్నారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహిస్తున్న అక్వాటిక్‌ కాంప్లెక్స్‌లో రెండవ జాతీయ అంతర్‌ క్లబ్‌ వాటర్‌ పోలో పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, శాట్స్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ పోటీలకు హైదరాబాద్‌ నగరం వేదిక అవుతోందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మంచి క్రీడా వాతావరణం నెలకొని ఔత్సాహిక క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. ఒకవైపు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు, మరొకవైపు 'ఫార్ములా వన్‌ రేస్‌' లాంటి ప్రఖ్యాత క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, హైదరాబాద్‌ను 'క్రీడల హబ్‌'గా తీర్చి దిద్దుతోందన్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పి. చంద్రశేఖర్‌ రెడ్డి, కార్యదర్శి జి. ఉమేష్‌, కొండా విజయ్‌ కుమార్‌, కృష్ణమూర్తి, శ్యామ్‌రాజ్‌, రామకృష్ణ, గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్‌ గోకుల్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story