SWIGGY: ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో నగరవాసుల రికార్డు.. ఎన్ని లక్షల ప్లేట్ల బిర్యానీ, హలీంలు ఆర్డర్ చేశారో తెలుసా?

by Shiva |
SWIGGY: ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో నగరవాసుల రికార్డు.. ఎన్ని లక్షల ప్లేట్ల బిర్యానీ, హలీంలు ఆర్డర్ చేశారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బిర్యానీ, హలీంను ఇష్టపడని ఫుడ్ లవర్స్ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ముఖ్యంగా మన నగరవాసులకు ముక్క లేనిదే ముద్ద దిగదండోయ్. పండగైనా.. పేరంటమైనా, బర్త్ డే పార్టీ, కిడ్డీ పార్టీ అయినా.. బిర్యానీ తినాలనిపిస్తే చేతిలో మొబైల్ ఉంటే సరి. ఎచ్చక్కా స్వీగ్గీ యాప్ ఓపెన్ చేసి ప్లేట్లకు ప్లే్ట్ల బిర్యానీలు ఆర్డర్ చేసేస్తుంటారు. ఈ క్రమంలోనే రంజాన్ మాసంలో ఫుడ్ డెలివరీ యాప్ స్వి్గ్గీ సరికొత్త రికార్డు సృష్టించింది. మార్చి 11న రంజాన్ మాసం ప్రారంభం అయిన నాటి నుంచి నేటి వరకు నగరవాసులు ఏకంగా 10 లక్షల బిర్యానీలు ఆర్డర్ చేశారట. అదేవిధంగా అందరి ఫేవరెట్ డిష్ అయిన హలీంను 5.3 లక్షల ప్లేట్ల హలీంను బుక్ చేశారట. రంజాన్‌ మాసం సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఇఫ్తార్‌ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని స్విగ్గీ తెలిపింది. ఎన్నడూ లేనివిధంగా ఈ స్థాయిలో కస్టమర్లు బిర్యానీలు ఆర్డర్ చేయడం ఇదే మొదటిసారి అని స్విగ్గీ ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed