- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణస్వీకారం..
దిశ, అలంపూర్ టౌన్: ఐదవ శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థాన పాలకమండలి సభ్యులు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. దేవస్థాన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సరిత, ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం హాజరయ్యారు. ధర్మకర్త సభ్యులు ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలొ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో 14మంది ధర్మకర్తల చేత దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ధర్మకర్త సభ్యులు అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన చిన్న కృష్ణయ్య ను చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి చైర్మన్ గా ఎన్నుకోబడిన చిన్నికృష్ణయ్యను చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. పుష్కర గాట్ లో ఏర్పాటుచేసిన సన్మాన సభలో చైర్మన్ ధర్మకర్త సభ్యులను పలువురు సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, అధికార ప్రతినిధి మంద జగన్నాథం మాట్లాడారు. రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠంగా వెలుగొందుతున్న జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఆలయాల దర్శనానికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తూ ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాబోయే రోజులలో జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయాలను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తుందని తెలిపారు. చైర్మన్ చిన్ని కృష్ణయ్య మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ఆలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమ్మవారి సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ మున్సిపల్ చైర్ పర్సన్, కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ కరుణ, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస రాజు, ఈఓ పురేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.